Raccha Ravi: ఖరీదైన కారు కొన్న రచ్చ రవి.. ధరెంతో తెలుసా?

దసరా పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు కొత్త కార్లను కొనుగోలు చేస్తూ దసరా పండుగ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నటి కీర్తి సురేష్ తో పాటు బుల్లితెర నటీనటులు కూడా పెద్ద ఎత్తున కొత్తకారులను కొనుగోలు చేశారు. వైవా హర్ష, బిత్తిరి సత్తి, షణ్ముఖ్ జస్వంత్, శివ జ్యోతి వంటి వాళ్ళు ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ రచ్చ రవి కూడా దసరా పండుగ సందర్భంగా కొత్త కారును కొన్నారు.

బిత్తిరి సత్తి తన రేంజ్ కు తగ్గట్టుగా రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేయగా షణ్ముఖ్ జశ్వంత్ శివజ్యోతి బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. ఇకపోతే వైవా హర్ష ఆడి కారును కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే రచ్చ రవి కూడా నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా పరిచయమైనటువంటి రచ్చ రవిఈ కార్యక్రమంతో సంపాదించుకున్న గుర్తింపుతో సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇలా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రచ్చ రవి జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లినప్పటికీ తిరిగి మల్లెమాల వారి చెంతకు వచ్చారు.ఇలా పలు సినిమాలు బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున సందడి చేస్తున్న రచ్చ రవి దసరా సందర్భంగా కొత్త కారు కొన్నారు.

ఈ క్రమంలోనే రచ్చ రవి కొత్త కారుకు సంబంధించిన వీడియోని,ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈయన కొనుగోలు చేసిన ఈ కారు సుమారు 20 లక్షలకు పైగా ఖరీదు చేస్తుందని తెలుస్తోంది. ఇక ఇంతటి ఖరీదైన కారును కొనుగోలు చేసిన రచ్చ రవికి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1

2

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus