Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కన్ఫ్యూజన్ మొదలైందిగా.. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడంటూ?

  • October 5, 2023 / 12:37 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజం అయింది. అధికారికంగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే దేవర రెండు భాగాలుగా తెరకెక్కితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ ఎప్పుడనే ప్రశ్న ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతోంది. ఈ సినిమాలతో పాటు తారక్ వార్2 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.

ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కన్ఫ్యూజన్ మొదలైందనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతుండటంతో ఎన్టీఆర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సరైన ప్రాజెక్ట్ లతో తారక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.

తారక్ ను (Jr NTR) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించే దిశగా తారక్ అడుగులు పడుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. దేవర సినిమా రెండు భాగాల ప్రకటనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus