Attarintiki Daredi: ‘అత్తారింటికి దారేది’ మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఏంటో తెలుసా?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘జల్సా’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం ‘అత్తారింటికి దారేది’. 2013 వ సంవత్సరం సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ఆ టైంలో థియేటర్లు మూతపడ్డాయి. అదే టైంలో ఊహించని విధంగా ‘అత్తారింటికి దారేది’ సినిమా నెట్లో లీక్ అయ్యింది. దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం.

మినిమమ్ కలెక్షన్స్ అయినా వస్తాయా.. జనాలు థియేటర్లకు అనే డైలమా అందరిలోనూ ఉంది. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫుల్ రన్లో ఈ మూవీ ‘మగధీర’ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా పక్కన చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏదీ కూడా ‘అత్తారింటికి దారేది’ సినిమా ముందు నిలబడలేకపోయాయి అని చెప్పాలి. ఇందులో ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ నాగార్జున నటించిన ‘భాయ్’, శర్వానంద్ ‘సత్య 2 ‘ , ప్రియమణి ‘చండీ’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇంకా చాలా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ‘అత్తారింటికి దారేది’ ముందు తొందరగానే దుకాణం సర్దేశాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus