Prabhas: ప్రభాస్ కు క్రిటిక్స్ సూచనలు ఇవే.. ఆ మాటలను నమ్మొద్దంటూ?

టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినీ ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ గత మూడు సినిమాలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ భారీ అంచనాలతో విడుదలైనా ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకునే విషయంలో ఫెయిలయ్యాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమాల ఫలితాలు మరింత బెటర్ గా ఉండేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తన మొహమాటాన్ని పక్కన పెట్టాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పోస్టర్లు, గ్లింప్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని రిలీజయ్యేలా ప్రభాస్ జాగ్రత్త పడాల్సి ఉంది. ఇతరుల మాటలను ప్రభాస్ నమ్మవద్దని సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ప్రాజెక్ట్ కే గ్లింప్స్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే గ్లింప్స్ రిలీజ్ కు ముందు ప్రభాస్ ఫ్యాన్స్ అనుభవించిన టెన్షన్ అంతాఇంతా కాదు,

ప్రాజెక్ట్ కే సినిమా పోస్టర్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరు. ప్రాజెక్ట్ కే సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని సమాచారం అందుతోంది. ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా పదుకొణే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రాజెక్ట్ కే సినిమా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విష్ణుమూర్తి పదో అవతారంలో ప్రభాస్ కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus