Deepthi Sunaina: హద్దులు దాటిన నెటిజన్.. ఘాటుగా స్పందించిన దీప్తి!

డబ్ స్మాష్ వీడియోలతో ఇంటర్నెట్ లో క్రేజ్ తెచ్చుకుంది దీప్తి సునయన. ఆ తరువాత ఈమెకి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. ఈ షోతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. మిలియన్ల మంది ఆమెని ఫాలో అవుతున్నారు. దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. ఈ మధ్యకాలంలో షణ్ముఖ్ తో బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది. తిరిగి మళ్లీ తన పనులతో బిజీ అయింది.

చాలా మెచ్యూర్డ్ గా కూడా ప్రవర్తిస్తుంది. తన మీద జరిగే ట్రోలింగ్ ను పట్టించుకోవడం మానేసింది. ఆమె బ్రేకప్ విషయంలో కూడా చాలా మంది దీప్తినే సపోర్ట్ చేశారు. ఇప్పుడు దీప్తి తన స్నేహితులతో గడుపుతూ.. తన వెబ్ ప్రాజెక్ట్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ తో బిజీ అయింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

కొందరు ఫన్నీ ప్రశ్నలు వేస్తే.. మరికొందరు చిరాకు తెప్పించే ప్రశ్నలు వేశారు. అందులో ఒకరైతే హద్దులు దాటి ఆమెని ఓ ప్రశ్న అడిగాడు. ‘నువ్ ఎప్పుడు చచ్చిపోతావ్..?’ అని దీప్తిని అడగ్గా.. దానికి ఆమె ఎంతో కూల్ గా ‘నువ్ పోయాకే’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ సరైన సమాధానం అంటూ ఆమెను పొగుడుతున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus