Dhootha Trailer: దూత అంటే ఏంటి.. ట్రైలర్ అదిరింది?

  • November 23, 2023 / 11:34 AM IST

అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో దూత అనే వెబ్‌ సిరీస్‌ రూపొందింది. జర్నలిస్టుల నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ను డిసెంబరు 1 నుండి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ చేయబోతున్నారు.పోస్టర్‌ తోనే … ఇదో హారర్‌, థ్రిల్లర్‌ టచ్‌ ఉన్న కాన్సెప్ట్ అని అర్థమైంది. టీజర్‌ పోస్టర్‌లో పేపర్‌ ముఖానికి అడ్డంగా ఉన్నట్లు చూపించారు. ఆ రెండు కాన్సెప్ట్‌ డిఫరెంట్‌గా అనిపించాయి. అయితే ఈ రెండు కాన్సెప్ట్‌లు కలిపే ఈ వెబ్‌ సిరీస్‌ను సిద్ధం చేశారని ముందే అందరికీ తెలిసి వచ్చింది.

తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది చూస్తుంటే అది నిజమే అని స్పష్టమవుతోంది.జర్నలిస్టులు, ఆత్మహత్యల నేపథ్యంలో ‘దూత’ సిరీస్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చెబుతుంది. చైతు లుక్‌ కొత్తగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అంతా అద్భుతంగా ఉంటుంది అనే క్లారిటీ వచ్చింది. ఇందులో కూడా హీరోయిన్ పేరు ప్రియ అని ఉంది. దర్శకుడు విక్రమ్ ప్రతి సినిమాలో ఈ పేరుని వాడుతున్న సంగతి తెలిసిందే. ఇక నాగ చైతన్య ఈ సినిమాలో సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

ఒక హత్య కేసులో జర్నలిస్టు ఇరుక్కొన్న తర్వాత అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ట్రైలర్ లో చూపించారు. వయోలెన్స్ పార్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. ’13 బి ‘ లాంటి డిఫరెంట్ మూవీ దూత (Dhootha ) రూపంలో విక్రమ్ కుమార్ నుండీ వస్తుంది అనే క్లారిటీ ఇచ్చింది ఈ ట్రైలర్

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus