Dil Raju: రాంచరణ్ తప్ప దిల్ రాజుకి అందుబాటులో లేని స్టార్ హీరోలు..!

  • February 14, 2023 / 07:39 PM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. దీంతో దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు దిల్ రాజు బ్యానర్లో సినిమాలు చేశారు. మిడ్ రేంజ్ హీరోలతో ఒక్కొక్కరితో రెండేసి సినిమాల చొప్పున చేసేశారు. ప్రస్తుతం రాంచరణ్ తప్ప దిల్ రాజు బ్యానర్లో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు లేరు.

అంతేకాదు ఇప్పట్లో ఎవ్వరూ కూడా దిల్ రాజు బ్యానర్లో సినిమా చేసే ఆసక్తి కనబరుస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. మహేష్ బాబు ‘హారిక అండ్ హాసిని’ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అయితే దానయ్య, మైత్రి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. వంటి బ్యానర్లలో సినిమాలు చేయాలి. ప్రభాస్ కు కూడా చాలా వరకు అంతే..! అల్లు అర్జున్ కూడా మైత్రిలోనే సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా అంతే..!

ఆఖరికి సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారు కూడా వేరే నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తున్నారు. ఓవరాల్ గా స్టార్ హీరోలను ఎక్కువగా ‘మైత్రి’ ‘పీపుల్ ఫ్యాక్టరీ’ బ్యానర్లు లాక్ చేసేస్తున్నాయి. సో దిల్ రాజుకి విజయ్ దేవరకొండ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

పరశురామ్ – విజయ్ కాంబోలో ఓ క్రేజీ మూవీ రూపొందనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. దిల్ రాజు ఇంకాస్త ట్రై చేస్తే నాని, రామ్ లు దొరకొచ్చేమో కానీ.. చరణ్- శంకర్ ల మూవీ రిలీజ్ చేసే వరకు దిల్ రాజుకి స్టార్ హీరో దొరక్కపోవచ్చు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus