రాశి ఖన్నా మేనేజర్ ప్రవర్తనను బయటపెట్టిన దిల్ రాజు

Advertisement

శతమానం భవతి మూవీ తర్వాత సతీష్ వేగేశ్న తెరకెక్కించిన సినిమా శ్రీనివాస కల్యాణం. ఇందులో నితిన్, రాశీ ఖన్నాలు హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇంతమంచి కథలో భాగం కావడం చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని రాశీఖన్నా వెల్లడించింది. అయితే రాశీ ఖన్నా మేనేజర్ తమకి చుక్కలు చూపించారని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు వాపోవడం.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. చిత్ర యూనిట్ తో కలిసి మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ.. “అన్నిటికంటే నాకు బాగా నచ్చిన విషయం ఇది.. కథ విని ఒకే అన్నది రాశి.. రెమ్యునరేషన్ ఫైనల్ చేసే దశలో తన మేనేజర్ ని ఆఫీస్ లో కూర్చోబెట్టి ఈ సినిమా తన చేయి జారకూడదని ఇన్ స్ట్రక్షన్ ఇచ్చింది. ఇంత బాగా కథ నచ్చినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించొచ్చు కదా.. అని మేనేజర్ ను అడిగితే..” కాదు సార్.. బాగోదు సర్. వేరే సినిమాలకు అలానే తీసుకుంటాం సర్’ అనే వాడు.

అలా మేనేజర్ అగ్రిమెంట్ చేసేవరకూ మాకు టార్చర్ చూపించాడు.” అని వివరించారు. అలాగే రాశీ గురించి వివరిస్తూ.. ” రాశి ఫోన్ చేసి ‘నేను ఈ సినిమా చెయ్యాలి. నేను ఈ సినిమా ఎలాగైనా చెయ్యాలి అని నాకు చెప్పింది. అంటే అది తనకున్న ప్యాషన్.. కథ నచ్చిన తర్వాత దాన్ని ఎలాగైనా వదిలిపెట్టకుండా చేయాలని ఒక తపన.. సినిమా పట్ల ఉన్న ప్రేమ అది. రాశీ.. నువ్వు ఈరోజు మూవీ చూసి ఇలా ఎమోషనల్ అయ్యావంటే ఇట్స్ రియల్లీ ఎ గుడ్ జర్నీ. ఇందాక మన టీమ్ మెంబర్స్ అందరూ నీ డెడికేషన్, హార్డ్ వర్క్, పెర్ఫార్మెన్స్ గురించి చెబుతున్నారు. రోజు రోజుకీ నీ నటన చాలా మెరుగవుతోంది. ‘తొలి ప్రేమ’కు ఈ సినిమాకు కూడా వేరియేషన్ చూపించావు.” అని పక్కనే హీరోయిన్ పై ప్రశంసలు కురిపించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus