96 రీమేక్ కోసం దిల్ రాజుకి దొరకని కథానాయకుడు!

  • December 10, 2018 / 11:45 AM IST

బహుశా గత ఏడెనిమిదేళ్ళలో దిల్ రాజు ఇంతటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఎప్పుడూ లేడేమో. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా నష్టాలు ఎదుర్కోవడమే కాక.. ఒక కొత్త సినిమా తీద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నా.. ఇప్పటివరకు హీరో ఫైనల్ అవ్వలేదు. అసలు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడమే మహాప్రసాదంగా భావించే హీరోలున్న ఈ ఇండస్ట్రీలో ఆయన నిర్మించడానికి రెడీగా ఉన్న ఒక తమిళ రీమేక్ లో నటించేందుకు సక్సెస్ ఫుల్ యువ కథానాయకులు మాత్రమే కాదు.. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న హీరోలు కూడా దిల్ రాజు ఆఫర్ ను కన్సిడర్ చేయడం లేదంట. దాంతో కథ, దర్శకుడు, హీరోయిన్ కూడా రెడీగా ఉన్న “96” సినిమా రీమేక్ ఇప్పటికీ మొదలవ్వలేదు.

మొదట్లో ఇంట్రెస్ట్ చూపించిన నాని “జెర్సీ, విక్రమ్ కుమార్” సినిమాలతో బిజీ అయిపోవడం. గోపీచంద్ మొదట్లో ఒప్పుకున్నప్పటికీ.. ఇప్పుడు కథలో మార్పులు చేయాలని అడుగుతుండడం, అందుకు తమిళ దర్శకుడు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు దిల్ రాజు. ఇంతకీ ఈ “96” రీమేక్ లో ఎవరు నటిస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus