Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే కొత్త బ్యానర్ ను స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘మార్కండేయ’ అనే సినిమాని రూపొందించబోతున్నారు దిల్ రాజు(Dil Raju). ‘స్పార్క్’ ‘సంతాన ప్రాప్తిరస్తు’ వంటి సినిమాలు చేసిన విక్రాంత్ రెడ్డి లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా గ్లిమ్ప్స్ లాంచ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా దిల్ రాజు చేసిన కామెంట్స్ ఎప్పటిలానే వైరల్ అవుతుంది.

Dil Raju

దిల్ రాజు మాట్లాడుతూ.. ” నా కెరీర్ మొత్తంలో చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలే నాకు ఎక్కువ లాభాలు అందించాయి. పెద్ద సినిమాలు ఆడినప్పటికీ 70 శాతం నాకు హెల్ప్ చేసినవి అవే. ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాలు అటు ఇటుగా ఉన్నా.. కంటెంట్ ని ఎంతవరకు నమ్మి తీస్తున్నాను అనే డౌట్ వచ్చింది. కొత్త వాళ్ళు కూడా మంచి కంటెంట్ తో వస్తున్నారు.

కానీ అవగాహన లేక డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో నేను కూడా అంతే. 90లలోనే నేను రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను. అయితే నాకు సినిమాపై ఉన్న ఇష్టంతో, దేవుడి దయతో ప్రయత్నించాను. అప్పుడు ‘పెళ్ళిపందిరి’ అనే సినిమా పుణ్యమాని నిలదొక్కుకున్నాను. ఆ అనుభవంతోనే కొత్త వాళ్ళని సరైన విధంగా గైడ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ క్రమంలో విక్రాంత్ రెడ్డితో ఈ ‘మార్కండేయ’ మొదలుపెట్టాం.

దీనికి ముందు విక్రాంత్ 2 సినిమాలు చేశాడు. అతని మొదటి సినిమా ‘స్పార్క్’ ప్రమోషన్స్ కి నేను వెళ్ళాను. వెళ్లి నామ మాత్రంగా మాట్లాడి వచ్చేశాను. ఆ సినిమాకి రూ.20 కోట్లు పెట్టాడని తెలిసి షాకయ్యను. తర్వాత ‘ఎంత పోయిందో కనుక్కో’ అని మా టీంకి చెప్పాను. వాళ్ళు ఓ నెంబర్ చెప్పారు. అయితే విక్రాంత్ నెక్స్ట్ సినిమాకి కోలుకుని ఓ కాన్సెప్ట్ సినిమా చేశాడు.

ఆ సినిమాని నేను ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూశాను.నిర్మాతకి కొంత ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు 3వ సినిమాకి మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus