కుర్రకారు కూడా ఆశ్చర్యపోయేలా.. క్రికెట్ ఆడుతూ సందడి చేసిన నిర్మాత దిల్ రాజు..!

Advertisement

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవల తన భార్య తేజస్వినితో కలిసి తన స్నేహితులను కలవడానికి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళారు.అక్కడ కుంటాల, పొచ్చర.. జలపాతాలను సందర్శించి ఎంజాయ్ చేశారు. అటు తరువాత పిల్లలతో క్రికెట్ కూడా ఆడారాయన.నేరేడిగొండ మండల కేంద్రంలోని గ్రౌండ్లో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ సందడి చేశారు దిల్ రాజు. 49 ఏళ్ళ వయసులో కూడా ఇంకా కుర్రాడిలానే కనిపిస్తూ అంతే ఎనర్జీతో కనిపిస్తున్నారు దిల్ రాజు.

మొన్నటికి మొన్న ఆయన జిమ్ చేస్తున్న ఫోటోలు కూడా నెట్టింట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆయన క్రికెట్ ఆడిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆయన భార్య తేజస్విని.. దిల్ రాజు లైఫ్ స్టైల్ ను కంప్లీట్ గా మార్చేసింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆయన నిర్మించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న(రేపు) అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.

ఇక పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ కొంతభాగం పెండింగ్లో ఉంది. ఆ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరగా ఫినిష్ చేసి 2021 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. అంతేకాకుండా నాగ చైతన్య – విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాని కూడా నిర్మించబోతున్నారు దిల్ రాజు.

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus