Dil Raju: పూర్తిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మారిన దిల్ రాజు… వీడియో వైరల్..!

  • April 9, 2021 / 12:55 PM IST

ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదల కాబోతుంది. థియేటర్లు తెరుచుకున్న తరువాత టాలీవుడ్లో విడుదల కాబోతున్న పెద్ద సినిమా ఇది. అందులోనూ 3 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ నుండీ రాబోతున్న మూవీ. దాంతో ‘వకీల్ సాబ్’ పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో థియేటర్ల వద్ద అభిమానుల సందడి పీక్స్ లో ఉంది. సెలబ్రిటీలు కూడా సినిమా చూడడానికి ఎగబడి థియేటర్లకు వస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం నిర్మాత అయిన దిల్ రాజు కూడా తన ఫ్యామిలీని వెంటబెట్టుకుని ‘వకీల్ సాబ్’ వీక్షించడానికి వెళ్లారు. అతను కూడా ఓ అభిమానిలా మారిపోయి పేపర్లు విసురుతూ రచ్చ చేసాడు మన దిల్ రాజు. భార్య పక్కన ఉన్నా సరే.. పవన్ ఎంట్రీ సీన్ రాగానే లేచి పేపర్లు విసురుతూ సందడి చేసాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ‘తొలిప్రేమ’ సినిమాని దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేసాడు. అప్పటి నుండీ నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని ఆశపడ్డాడు.

20 ఏళ్లకు ఆ కల నెరవేరినట్టు స్పష్టమవుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చెట్టు చిత్రాన్ని నిర్మించాలి అని ప్లాన్ చేసాడు కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. కానీ పవన్ తో సినిమా చెయ్యడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలి అన్ని విధాలుగానూ ప్రయత్నించాడు. చివరికి ‘పింక్’ రీమేక్ తో అది సాధ్యమైంది. ఇక ఓవర్సీస్ నుండీ ‘వకీల్ సాబ్’ కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. కచ్చితంగా ఈ సినిమా భారీ కలెక్షన్లను నమోదు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus