దిల్-రాజు భార్య తేజ‌స్వినిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..!

Advertisement

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. ఆ లిస్ట్ లో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్-రాజు కూడా ఉన్నారు. ఈయన కూతురు హన్షిత రెడ్డికి ఇచ్చిన మాట మేరకు.. తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. 49 ఏళ్ళ వయసులో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవడంతో.. ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఏదేమైనా దిల్ రాజు గారు రెండో వివాహం చేసుకుని హ్యాపీగానే కాలం గడుపుతున్నారు.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈయన రెండో భార్య తేజస్విని రైటర్ గా మారబోతుందన్నది తాజా సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. పూర్తి వివరాల్లోకి వెళితే.. తేజ‌స్విని‌ గారికి క‌థ‌లు రాసే ట్యాలెంట్ ఉందట. ఓ హిట్ సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలో ఎస్టిమేషన్ వేసి… అవి చెప్పగల సమర్థురాలని కూడా తెలుస్తుంది. భార్య ట్యాలెంట్ ను గుర్తించిన దిల్ రాజు గారు…‌. ఆమె రాసిన కొన్ని క‌థ‌ల్ని స్క్రిప్టు రూపంలోకి మార్చే ప‌ని మొదలుపెట్టారట.

కొంతమంది సీనియర్ రైటర్స్ తో ఆ క‌థ‌లను స్క్రిప్ట్ లు గా మార్చబోతున్నట్టు సమాచారం. త్వ‌ర‌లో దిల్ రాజు నిర్మించే ఓ సినిమాకి ఈమెను కో రైటర్ గా పెట్టి..అటు తరువాత ఈమె తయారు చేసిన కథలతో చిన్న సినిమాలు ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు క‌థ‌లను జడ్జి చెయ్యడంలో స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే‌.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16


Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus