డైరెక్టర్ అనిల్ రావిపూడి చేస్తున్న తప్పు ఇదేనా?

  • December 5, 2022 / 05:15 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోయిన్ గా క్రేజ్ ఉన్న హీరోయిన్లను ఎంపిక చేస్తారనే సంగతి తెలిసిందే. అతి త్వరలో బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియాంక జవాల్కర్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీలీలకు తల్లి పాత్రలో యంగ్ హీరోయిన్ ను చూపించడం సాధ్యమయ్యే పని కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య ప్రియాంక జోడీ కూడా బాగుండదని వైరల్ అవుతున్న ఈ వార్తను నమ్మే పరిస్థితి లేదని మరి కొందరు చెబుతుండటం గమనార్హం. అయితే అనిల్ రావిపూడి హీరోయిన్ గురించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు వెల్లడిస్తున్నారు. స్పష్టత లేకపోవడం వల్లే ఈ సినిమా హీరోయిన్ గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైనట్టేనని సమాచారం.

వచ్చే ఏడాది బాలయ్య రెండు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అఖండ సక్సెస్ తో మార్కెట్ ను పెంచుకున్న బాలకృష్ణ ఆ మార్కెట్ మరింత పెరిగేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర ఓటీటీలు సైతం బాలయ్యతో అన్ స్టాపబుల్ తరహా ప్రోగ్రామ్స్ చేయాలని భావిస్తున్నట్టు బోగట్టా. త్వరలో అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ వస్తున్నాడనే వార్త వైరల్ కాగా ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఒకే ఫ్రేమ్ లో బాలయ్య ప్రభాస్ కనిపిస్తే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదని మరి కొందరు చెబుతున్నారు. బాలయ్య షోకు త్వరలో చిరంజీవి కూడా హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఈ కాంబినేషన్ సాధ్యమవుతుందేమో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus