జెనీలియా అంటే అందరికీ హాసినేనే గుర్తుకు వస్తుంది. భాస్కర్ దర్శకత్వంలో సిద్ధార్థ జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించినటువంటి చిత్రం బొమ్మరిల్లు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జెనీలియా నటన ఎంతో అద్భుతంగా, కాస్త తింగరితనంగా ఉండడంతో అందరికీ ఈమె హాసినిగానే గుర్తుండిపోయారు. ఇలా హాసినిగా ప్రేక్షకుల మదిని దోచినటువంటి ఈమె ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి.
ఇకపోతే తాజాగా బొమ్మరిల్లు సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాత్రిపూట బైటకి వెళ్లి ఐస్ క్రీమ్ తినే సన్నివేశం ఉంది అయితే ఈ సన్నివేశాన్ని షూట్ చేయడం కోసం డైరెక్టర్ భాస్కర్ జెనీలియాను చాలా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది. రాత్రి షూట్ చేయటం వల్ల ఏకంగా ఈ సీన్ చేయటానికి మూడు రోజుల సమయం తీసుకున్నారట
ఇలా మూడు రోజుల పాటు జెనీలియాకు సరైన నిద్ర లేకుండా చాలా టార్చర్ చేశారని డైరెక్టర్ పెట్టిన టార్చర్ కి ఈమె నేను ఈ సినిమాలో నటించినని చెప్పి కోపంగా క్యారవాన్ లోకి వెళ్లి కూర్చున్నారట. అయితే ఈ విషయం అల్లు అర్జున్ కి తెలియడంతో ఆయనే ఈమెకు నచ్చచెప్పి తిరిగి ఈ సినిమాలో పాల్గొనేలా చేశారని తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ చెప్పడంతోనే జెనీలియా తిరిగి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు .
జెనీలియా (Genelia) అల్లు అర్జున్ ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో ఆయన చెప్పగానే బొమ్మరిల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇలా సినిమా నుంచే తప్పుకుంటానని చెప్పినటువంటి జెనీలియా అల్లు అర్జున్ చెప్పడంతో ఈ సినిమాలో భాగమయ్యారు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తుంది. అల్లు అర్జున్ జెనీలియా కాంబినేషన్లో కూడా హ్యాపీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!