Bobby, Chiranjeevi: చిరు 154 పై అవన్నీ ఫేక్ న్యూస్ లట..!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ చిత్రాలను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరు. వీటితో పాటు బాబీ డైరెక్షన్లో కూడా ఓ మూవీ చేయడానికి చిరు ఓకె చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్నారు.

Click Here To Watch NOW

రవితేజ గెస్ట్ రోల్ కూడా చేస్తుండడం ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ. షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై చిత్ర బృందానికి ప్రశ్నించగా అవన్నీ గాలి వార్తలు అంటూ కొట్టి పాడేసింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుందట.చిరుని దర్శకుడు బాబీ ప్రెజెంట్ చేసే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది అని…చిరు అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు అందరికీ ఈ మూవీ ఓ విందు భోజనంలా అనిపించేలా ఆయన తీర్చిదిద్దుతున్నారు అని వారు చెబుతున్నారు.

చిరంజీవి కూడా బాబీ వర్క్ ను ఎప్పటికప్పుడు అప్రీషియెట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు అని… సోషల్ మీడియాలో వచ్చే ఏవేవో వార్తలను నమ్మొద్దు అంటూ వారు చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా శృతీ హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus