Adivi Sesh: హిట్టిచ్చిన డైరెక్టర్ ని తప్పించారుగా!

  • December 29, 2022 / 05:25 PM IST

నాలుగేళ్ల క్రితం విడుదలైన ‘గూఢచారి’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతోనే అడివి శేష్ రేంజ్ బాగా పెరిగిపోయింది. తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీతో సినిమా తీసి మెప్పించారు. స్పై బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ టేకింగ్ తో తీసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా దర్శకుడు శశి కిరణ్ తిక్కాకు మంచి పేరొచ్చింది. ఆ కారణంగానే శేష్, శశి కిరణ్ కాంబినేషన్ లో ‘మేజర్’ అనే మరో తీశారు.

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. తాజాగా ‘గూఢచారి’ సీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీనికి కూడా దర్శకుడిగా శశి కిరణ్ ఉంటారనే అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఓ కొత్త దర్శకుడిని ఫైనల్ చేశారు. అతడి పేరు వినయ్ కుమార్. ఇతడు ‘మేజర్’ సినిమాకి ఎడిటర్ గా పని చేశారు. ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు అడివి శేష్. నిజానికి ‘గూఢచారి’ సీక్వెల్ కి దర్శకుడిగా శశి కిరణ్ ఉంటారని ఇదివరకు శేష్ స్వయంగా చెప్పారు.

ఆ తరువాత ఇద్దరూ ‘మేజర్’ సినిమాతో బిజీ అవ్వడంతో ‘గూఢచారి2’కి సంబంధించిన చర్చ రాలేదు. మళ్లీ ఇంతకాలానికి ‘జి2’ పేరుతో అనౌన్స్మెంట్ వచ్చింది. పోస్టర్ లో డైరెక్టర్ పేరు మారింది. అడివి శేష్ కు, శశికిరణ్ కు ఏం జరిగిందనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఇక కొత్త దర్శకుడు వినయ్ కుమార్ గురించి చెప్పాలంటే.. అతడు కొన్నేళ్లుగా అడివి శేష్ టీమ్ లోనే ఉన్నారు. ‘మేజర్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.

ఇక ‘గూఢచారి2’ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకె ఎంటర్ టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీన్ని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి జనవరి 9న ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus