తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఊహించని స్థాయిలో ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్న హీరోలలో తారక్ ఒకరు. చిన్న వయస్సులోనే తారక్ స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నారు. తారక్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ మరో ఐదు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. తారక్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా మూడున్నరేళ్లు ఆర్ఆర్ఆర్ కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. కొమురం భీమ్ పాత్రకు తారక్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Click Here To Watch NEW Trailer
తారక్, చరణ్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు భారీస్థాయిలో పెరిగినా అభిమానులు మాత్రం టికెట్లను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజవుతున్న తరుణంలో ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ తారక్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గీతాకృష్ణ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ బ్లడ్ నుంచి వచ్చానని చెప్పారని అయితే ఆయనను యాక్టింగ్ విషయంలో ఇమిటేట్ చేయలేదని గీతాకృష్ణ అన్నారు.
ఒక ఇంటర్వ్యూలో తారక్ చిరంజీవి ఎవరో తెలియదని అన్నారని ఆ సమయంలో నాగార్జున కొంచెం తగ్గు బాబు అంటూ తారక్ ను కరెక్ట్ చేశారని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అలా కామెంట్లు చేయడం వల్ల కొన్ని సినిమాలు కూడా పోయాయని గీతాకృష్ణ తెలిపారు. చిరంజీవి మట్టిలో మాణిక్యమని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే యంగ్ టైగర్ అభిమానులు మాత్రం తారక్ చిరంజీవిని అలా అన్నారని ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.
చిరంజీవి, తారక్, నాగార్జునలలో ఎవరో ఒకరు ఈ వార్త గురించి స్పందించి మరింత క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఎప్పుడూ లేవని ఫ్యాన్స్ చెబుతున్నారు. పెద్దలను గౌరవించే విషయంలో తారక్ ముందుంటారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!