Salaar: ప్రభాస్ లుక్ విషయంలో పెదవి విరుస్తున్న ప్రశాంత్ నీల్!

  • September 6, 2022 / 04:38 PM IST

కన్నడ చిత్రపరిశ్రమలో దర్శకుడుగా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా ప్రపంచం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తొంగి చూసేలా కేజిఎఫ్ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం సలార్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంభలే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేయాలని భావించినప్పటికీ ప్రభాస్ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ప్రభాస్ సలార్ సినిమాతో పాటు మరోవైపు ప్రాజెక్టుకే సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా ఆది పురుష్ సినిమా షూటింగ్ కోసం తరచూ ముంబై వెళ్తూ ఉన్నారు

అయితే ఈయన మూడు సినిమా షూటింగులలో పాల్గొనడం వల్ల పూర్తిగా తన ఫిజిక్ విషయంలో మార్పులు వస్తున్నాయి.ఇలా ప్రభాస్ లుక్ తరచు మారడం వల్ల ప్రభాస్ లుక్ విషయంలో ప్రశాంత్ నీల్ పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సలార్ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడుకున్న సినిమా అయితే ఇందులో ప్రభాస్ ఒక్కో సన్నివేశంలో ఒక్కో లుక్ కనపడితే మొదటికే మోసం వస్తుంది

అందుకే యాక్షన్స్ అన్ని వేషాలలో క్లోజప్ షాట్ లో మినహా మిగిలిన సన్నివేశాలలో ప్రభాస్ డూప్ తో సినిమా షూటింగ్ చేస్తున్నారని సమాచారం. అయితే ప్రభాస్ అన్ని సన్నివేశాలలో ప్రభాస్ చేయటం వల్లగ్రాఫిక్స్ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వస్తున్న నేపథ్యంలో క్లోజప్ సన్ని వేశాలలో మినహా మిగిలిన సన్నివేశాలలో ప్రభాస్ డూప్ చేత షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus