‘ఎఫ్2’ హీరోయిన్ల బికినీ డ్రెస్ పై రాఘవేంద్ర రావు స్పందన..!

  • March 6, 2019 / 02:03 PM IST

ఈ సంక్రాంతికి విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ‘ఎఫ్2’ చిత్రం. ఈ చిత్రం మర్చి 2 కి 50 రోజులు పూర్తిచేసుకుంది. ఇటీవల ఈ చిత్ర అర్ద శతదినోత్సవ వేడుకని నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విచ్చేసారు. సాధారణంగా రాఘవేంద్ర రావు చాలా తక్కువగా మాట్లాడతారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో మాత్రం ఛలోక్తులు, పంచ్‌లతో అయన ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. ఇందులో భాగంగా హీరోయిన్ బికినీల పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. “చాలా సంవత్సరాల తరువాత ఓ మంచి సినిమా చూశాను. నన్ను 20 ఏళ్ళు వెనక్కి తీసుకుని ఈ చిత్రం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అనీల్ రావిపూడి సినిమా చూస్తే చాలు .. ఆటోమేటిక్‌గా హెల్త్ వచ్చేస్తుంది. అంత ఆరోగ్యంగా నవ్విస్తాడు. తన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఒకటికి రెండుసార్లు అనిల్ రావిపూడి సినిమాలు చూస్తాను. ఈ సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా.. చిన్న సినిమా పెద్ద హిట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాకు నచ్చిన డైలాగ్.. ‘ఉన్నది ఒక్కటే కూతురు.. ఉన్నదంతా ఆమెకే కదా’ అని.. ఈ సంక్రాంతికి ఉన్నది ఒకటే సినిమా.. ఉన్నదంతా ఊడ్చిపడేసింది. పెద్ద సినిమాలు హిట్ అయినప్పటికంటే.. చిన్న సినిమాలు విజయాలు సాధిస్తేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చూసినా నవ్వించే క్యారెక్టర్లే.. అంతేగా! ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే ఇద్దరమ్మాయిల్ని (మెహ్రీన్, తమన్నా) చాలా అందంగా చూపించారు. స్విమ్ సూట్‌లో చాలా అద్భుతంగా ఉన్నారు. అందుకే మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూశారు.. కాబట్టి ఇంత పెద్ద విజయం సాధించింది. ఎప్పుడూ అమ్మాయిల్ని కన్నీళ్ళు, కష్టాలు లేకుండా ఇలా గ్లామరస్ చూపించండి’.. అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus