Indian2: రామ్ చరణ్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి శంకర్?

  • September 23, 2023 / 10:23 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నటువంటి ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలను సమానంగా షూటింగ్ చేస్తూ వచ్చారు. ఉపాసన డెలివరీ సమయం దగ్గర పడటంతో రామ్ చరణ్ కొంతకాలం పాటు ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చారు.

దీంతో శంకర్ చెన్నై వెళ్ళిపోయి ఇండియన్2 (Indian2)  సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఇలా రాంచరణ్ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ ఇవ్వడంతో ఈయన ఇండియన్ టు సినిమా షూటింగ్ పనులను పూర్తి చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నటువంటి శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది రాంచరణ్ అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కమల్ హాసన్ సినిమా అయితే పూర్తి చేశావు కానీ శంకర్ మరి రాంచరణ్ సినిమా పరిస్థితి ఏంటి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేస్తారు అంటూ భారీ స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్ రాకపోవడంతో రాంచరణ్ అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వచ్చే వారంలో శంకర్ హైదరాబాద్ రాబోతున్నారని ఇక్కడే ఈ సినిమా షూటింగ్ పనులలో భాగంగా సరికొత్త షెడ్యూల్ చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇండియన్ టు షూటింగ్ అయిపోవడంతో శంకర్ తన పూర్తి దృష్టి రాంచరణ్ గేమ్ చెంజర్ పైన పెట్టారని సమాచారం.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus