Balakrishna: బాలయ్యను ఫ్యాన్స్ కొడితే పరిస్థితేంటి.. దర్శకుడి కామెంట్స్ వైరల్!

  • April 26, 2024 / 04:46 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ (Balakrishna) కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరనే సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో అభిమానులపై బాలయ్య చేయి చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే బాలయ్య కొట్టినా దెబ్బలు తిన్న అభిమానులు ఆయన గురించి నెగిటివ్ గా రియాక్ట్ అయిన సందర్భాలు దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే. గతంలో బాలయ్యకు కోపం ఎక్కువని కామెంట్లు చేసిన కేఎస్ రవికుమార్ (K. S. Ravikumar) తాజాగా ఒక ఇంటర్వ్యూలో మరిన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నారు.

కె.విశ్వనాథ్ (K. Vishwanath) డైరెక్షన్ లో తెరకెక్కిన జననీ జన్మభూమి మూవీకి తాను అసోసియేట్ గా వర్క్ చేశానని తన వయస్సు వాళ్లతో బాలయ్య ఆ సమయంలో సరదాగా ఉండేవారని పేర్కొన్నారు. రానురాను బాలయ్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని రవికుమార్ వెల్లడించారు. బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని అంత మాత్రాన ఎవరు పడితే వారిని కొడితే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.

జననీ జన్మభూమి షూట్ సమయంలో కొంతమంది అభిమానులు బాలయ్యతో ఫోటోలు దిగడానికి ప్రయత్నించగా ఒక అభిమాని బాలయ్య భుజంపై చేయి వేయడంతో బాలయ్య ఆ అభిమానిని చితక్కొట్టాడని రవికుమార్ చెప్పుకొచ్చారు. బాలయ్య ప్రవర్తించిన తీరు తప్పు అని రవికుమార్ కామెంట్లు చేశారు. అభిమానులు తిరిగి కొడితే బాలయ్య పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. కేఎస్ రవికుమార్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

అయితే పదేపదే ఈ దర్శకుడు బాలయ్యను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. బాలయ్యతో రెండు సినిమాలు చేసిన ఈ దర్శకుడు బాలయ్య స్థాయిని తగ్గించేలా కామెంట్లు చేయడంపై బాలయ్య ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ కామెంట్ల గురించి బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. బాలయ్య ప్రస్తుతం బాబీ (Bobby) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus