Jr NTR: ఫోటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ సీరియస్ కావడం వెనుక ఇంత కథ ఉందా?

సాధారణంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎప్పుడూ కూల్ గా ఉంటారు. మరీ కోపం, చిరాకు తెప్పిస్తే తప్ప తారక్ సీరియస్ కావడం జరగదు. అయితే ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఓయ్ అంటూ అరిచిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా సీరియస్ కావడం వెనుక అసలు రీజన్ వేరే ఉందని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో లుక్ రివీల్ కాకూడదనే ఆలోచనతో ఫోటోలు తీయవద్దని జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే ఫోటోగ్రాఫర్లకు సూచించడం జరిగిందని తెలుస్తోంది. అయితే కొందరు ఫోటోగ్రాఫర్లు మాత్రం అత్యుత్సాహంతో తారక్ ఫోటోలు, వీడియోలు తీయడం జూనియర్ ఎన్టీఆర్ కు చిరాకు తెప్పించిందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హోటల్ కు వెళ్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు, వీడియోలు తీసినట్లు సమాచారం అందుతోంది.

ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 60 రోజుల కాల్షీట్స్ కేటాయించారట. వార్1 ను మించిపోయేలా వార్2 సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 2025 ఆగష్టు 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అలా చేయడంలో తప్పు లేదని నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. సెలబ్రిటీల అనుమతి లేకుండా ఫోటోలు తీయడం తప్పేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కోపం తెప్పించారంటే ఆ ఫోటోగ్రాఫర్లు లిమిట్స్ క్రాస్ చేసి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తారక్ ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. దేవర (Devara)  సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలుకానున్నాయని తెలుస్తోంది. దేవర సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని ఈ స్టార్ హీరో ఫీలవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus