Srikanth Addala, Darshan: మంచి సినిమాల దర్శకుడు..వివాదాల హీరో, ఊహించని కాంబో..!

  • July 12, 2024 / 01:38 PM IST

కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) మొన్నామధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. తన అభిమాని రేణుకాస్వామిని తన ప్రియురాలు పవిత్ర గౌడ్ కోసం అతన్ని మనుషులతో కిరాతకంగా కొట్టించి చంపేశాడు అంటూ అతని పై కేసు నమోదవ్వడం.తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో దర్శన్ పై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిందే. అతని సినీ కెరీర్ కూడా ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇతని అప్ కమింగ్ ప్రాజెక్టుల పై అనుమానం కలిగేలా చేసింది.

ఇలాంటి టైంలో ఓ టాలీవుడ్ డైరెక్టర్ సైలెంట్ గా దర్శన్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఆ టాలీవుడ్ డైరెక్టర్ మరెవరో కాదు.. శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) . అవును.. శ్రీకాంత్ అడ్డాల, దర్శన్ తో ఓ సినిమా సెట్ చేసుకున్నాడట. మంచి సినిమాలు తీస్తుంటాడు అంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పై అందరిలో ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అయితే కొన్నాళ్లుగా ఆ ఇమేజ్ ను బ్రేక్ చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడు.

వెంకటేష్ (Venkatesh Daggubati) తో ‘నారప్ప’ (Narappa) , ‘పెదకాపు 1’ (Peddha Kapu 1) వంటి సినిమాలు అతను అందుకే తీసాడేమో అనే ఫీలింగ్ కలుగకమానదు. ఇప్పుడు దర్శన్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి… అది నిజమని ఫిక్స్ అయ్యే బ్యాచ్ కూడా ఉండొచ్చు. అయితే దర్శన్ తో శ్రీకాంత్ సినిమా మొదలుపెట్టి చాలా రోజులు అయ్యిందట. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) , బాపినీడు.. లు నిర్మిస్తున్నట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus