ఆ వార్తలన్నీ అవాస్తవం… రతన్ టాటా బయోపిక్ పై సుధా కొంగర కామెంట్స్!

  • December 5, 2022 / 07:23 PM IST

చిత్ర పరిశ్రమలో లేడీ దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతేడాది ఈమె సూర్య హీరోగా తెరకేక్కిన సురారై పోట్రు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాకు గానూ ఈమెకు జాతీయ ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా అనంతరం భారతీయ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రతన్ టాటా బయోపిక్ సినిమాతో సుధా కొంగర ఎంతో బిజీగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా రతన్ టాటా బయోపిక్ సినిమాలో చేయడం కోసం హీరో సూర్యను సంప్రదించినట్టు కూడా వార్తలు. ఇక ఈ వార్తలపై స్పందించిన సుధా కొంగర క్లారిటీ ఇచ్చారు. తనకు రతన్ టాటా అంటే అమితమైన గౌరవం ఉందని ఆయన అంటే చాలా ఇష్టం అని తెలిపారు.

అయితే నేను తన బయోపిక్ చేస్తున్నానంటూ వచ్చే వార్తలలో ఏ విధమైనటువంటి నిజం లేదని ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలిపారు.ఇకపోతే త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టు గురించి అన్ని విషయాలను తెలియచేస్తానని ఈమె వెల్లడించారు. ఇలా రతన్ టాటా బయోపిక్ గురించి క్లారిటీ ఇచ్చిన అనంతరం ఈమె కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా,

హోం భలే నిర్మాణ సంస్థలో తెరకెక్కబోతున్న సినిమాకి దర్శకురాలిగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఈమె త్వరలోనే ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వబోతున్నారా అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus