Teja,Gopichand: గోపీచంద్ ను నేరుగా నిలదీసిన తేజ.. ఏమైందంటే..?

  • May 4, 2023 / 12:26 PM IST

ఎన్నడూ లేని విధంగా గోపీచంద్..తన సినిమా ప్రమోషన్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అతను నటించిన ‘రామబాణం’ సినిమా మే 5న విడుదల కాబోతోంది. దీంతో నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూలు వంటివి ఇస్తూ సినిమా పై బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో చిత్ర బృందం.. గోపీచంద్ కు లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. సహజంగానే తేజ జనాలను ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడతాడు. ఇక గోపీచంద్ మృదు స్వభావి.

అందుకు తగ్గట్టే గోపీచంద్ పై తేజ ప్రశ్నల బాణాలు వదిలినట్టు ప్రోమో క్లారిటీ ఇచ్చింది. ఇక ఇంటర్వ్యూ కూడా అదే విధంగా ఉంది. విషయం ఏంటంటే.. తేజ దర్శకత్వంలో ‘అలివేలు మంగ’ అనే సినిమా గోపీచంద్ చేయాల్సి ఉంది. గోపీచంద్ ను హీరోగా పెట్టి తేజ తీయాలనుకున్న సినిమా ఇది. ఈ క్రమంలో హీరోయిన్ ని వెతికే పనుల్లో దర్శకుడు తేజ బిజీగా ఉండగా.. గోపీచంద్ వేరే సినిమాకి కమిట్మెంట్ ఇచ్చేశాడట.

తేజ (Teja) ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదట. దీంతో ఇదే టైం అనుకుని గోపీచంద్ ను లైవ్ లో నిలదీశాడు తేజ. ‘నేను ఎవరినీ సినిమా చేయమని అడగను. నీతో సినిమా చేద్దాం అని భావించి హీరోయిన్ సెట్ అవ్వక నేను ఆ పనిలో ఉంటే నువ్వు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు.ఇలాంటివి అవసరమా అని నేను కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తుంటాను’ అని తేజ చెప్పాడు.

ఇందుకు గోపీచంద్.. ‘మీరు ఫోన్ చేసినప్పుడు నేను జిమ్ లో ఉన్నాను. మీ ఫోన్ లిఫ్ట్ చేసి నో చెప్పడానికి నాకు మనసు రాదు. పైగా మీరు చెప్పిన కథలో నా పాత్ర కంటే హీరోయిన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది’ అంటూ సమాధానమిచ్చాడు. ఇందుకు తేజ కూడా ‘నిజమే’ అంటూ సమాధానం ఇచ్చాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus