Teja: నువ్వింత భయస్తుడవయ్యుండి కూడా మమ్మల్ని ప్రశ్నిస్తావా: తేజ

  • May 31, 2023 / 01:58 PM IST

దర్శకుడు తేజ… ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఎంతటి క్లిష్టమైన ప్రశ్నలు వేసినా తడుముకోకుండా సమాధానం చెప్పే వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి ముందు తోక జాడిస్తే ఎలా ఉంటుంది. కత్తిరించి పడెయ్యడు.? ఇప్పుడు కూడా అదే జరిగింది. కొంతకాలంగా టాలీవుడ్లో ఏ మూవీ ప్రెస్ మీట్లో చూసినా.. ఓ రిపోర్టర్ ముందు వరుసలో కూర్చుని, మైక్ బలవంతంగా లాగేసుకుని మరీ లాజిక్ లెస్, బేస్ లెస్ , సెన్స్ లెస్ క్వశ్చన్ లు వేస్తూ సినిమా యూనిట్ సభ్యులను ఇబ్బంది పెడుతుండటం చూస్తూనే ఉన్నాం.

అతను వేసే ప్రశ్నలకు హీరోలు కానీ హీరోయిన్లు కానీ, డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ.. కౌంటర్లు వేసినా… ఆ ఫుటేజ్ ను తీసుకుని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేసినా.. ఆ రిపోర్టర్ కనీసం తగ్గడం లేదు. నిజానికి అతనికి కావాల్సింది కూడా ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇతనిపై కోపంతోనో ఏమో కానీ కొంతమంది దర్శకులు ఇతనికి క్లాస్ పీకుతున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

మొన్నటికి మొన్న దర్శకుడు హరీష్ శంకర్.. ఇతని పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ‘అహింస’ ప్రెస్ మీట్లో కూడా తేజ ఇతని పై మండిపడుతూ.. తర్వాత నవ్వి కవర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.నిజానికి ఆ రిపోర్టర్ కూడా గతంలో పలు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాడు. అందులో ఒకటి రెండు హిట్ అయ్యాయి. ఈ విషయం పై దర్శకుడు (Teja) తేజ ఆ రిపోర్టర్ ను ప్రశ్నించి చిత్ర హింసలు చేశాడు.

మీరు కూడా సినిమాలు చేసేవారు కదా ఇప్పుడు ఎందుకు చెయ్యలేదు అని ఆ రిపోర్టర్ ను అడిగితే ‘లాక్ డౌన్ తర్వాత జనాలు థియేటర్ కు రారేమో అని భయమేసి’ అంటూ సమాధానం ఇచ్చాడు. ‘ఇంత భయపడే వాడివి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయడానికి ఎంత ధైర్యం’ అంటూ తేజ తన మనసులో ఉన్న కోపాన్ని బయటపెట్టి ఆ తర్వాత నవ్వుతూ కవర్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus