మరో మామా- అల్లుళ్ల సినిమా రెడీ అవుతోందా?

Advertisement

సుమారు రెండేళ్లు సినిమాలు చేయని ఓ హీరో, మూడేళ్ల క్రితం సినిమా చేసిన దర్శకుడు కలసి సినిమా చేయబోతున్నారట. అవును 2019తో ‘సెవెన్‌’తో ప్రేక్షకుల ముందకొచ్చి అదృష్టం పరీక్షించుకున్న హవీష్‌, 2018లో ‘హలో గురూ ప్రేమ కోసమే’ దర్శకత్వం వహించిన త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందట. అది కూడా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందట. బాక్సింగ్‌ నేపథ్యంలో త్రినాథరావు నక్కిన ఓ కథ రాసుకున్నట్లు గతంలో వార్తలొచ్చాయి.

ఇప్పుడు హవీష్‌తో ఆ సినిమా తెరకెక్కిస్తాడట. ఈ సినిమా ముహూర్తం కొన్ని రోజుల క్రితం కొద్ది మంది సమక్షంలో జరిగిందట. ఈ సినిమాలో హవీష్‌ మాస్‌ లుక్‌లో బాక్సర్‌గా కనిపిస్తాడట. దీని కోసం బాడీని బిల్డ్‌ చేసుకునే పనిలో ప్రస్తుతం హవీష్‌ ఉన్నాడట. ఈ సినిమాకు హవీష్‌ తండ్రి కె.సత్యనారాయణ నిర్మిస్తారు. మామూలుగా త్రినాథరావు నక్కిన సినిమాలంటే మామా అల్లుళ్ల కథ అవుతూ వచ్చింది. మరి సినిమాలో బాక్సర్‌ అల్లుడుకి మామ ఉంటాడా.. అనేది చూడాలి.

ఒకవేళ మామ ఉంటే అతను కూడా బాక్సర్‌ కోచ్‌ అయ్యే అవకాశం ఉంది. మరి మామ క్యారెక్టర్‌కి ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. హెడ్డింగ్‌లో రణ్‌బీర్‌ అన్నారు… ఎక్కడా ఆ మాట లేదేంటి అనుకుంటున్నారా. ఈ మాట మేమన్నది కాదు హవీష్‌ రెండో సినిమా ‘రామ్‌ లీలా’ టైమ్‌లో చిత్రబృందమే అంది. అదన్నమాట విషయం.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus