Trivikram: త్రివిక్రమ్ విషయంలోనే ఎందుకిలా.. తప్పు ఎక్కడ జరుగుతోందంటూ?

  • July 21, 2023 / 08:39 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం సినిమాతో త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో ఒక సినిమాను తెరకెక్కించనుండగా ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

బండ్ల గణేశ్ పలు సందర్భాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పరోక్షంగా ట్వీట్లు చేయగా ఆ ట్వీట్లు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన చాలా రోజుల తర్వాత తారక్ త్రివిక్రమ్ మధ్య విభేదాలు రావడంతో ఈ సినిమా ఆగిపోయిందనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం సినిమాకు సంబంధించి కూడా హీరోయిన్ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు.

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తాను చెప్పిన స్టోరీ లైన్ తోనే హిరణ్యకశిప సినిమా తెరకెక్కుతోందని పరోక్షంగా చెబుతున్నారు. ఈ సినిమాకు కథ అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం గమనార్హం అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో ఒక వివాదం ద్వారా వరుసగా వార్తల్లో నిలుస్తుండటం ఫాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ వివాదాల గురించి, విమర్శల గురించి స్పందించి స్పష్టత ఇస్తారేమో చూడాల్సి ఉంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) తనపై నెగిటివ్ కామెంట్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ పారితోషికం 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. త్రివిక్రమ్ కు రాబోయే రోజుల్లో వరుస సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus