‘ఉయ్యాలా జంపాలా’ దర్శకుడు విరించి వర్మ నెక్స్ట్ మూవీ ‘జితేందర్ రెడ్డి’ టైటిల్ పోస్టర్ విడుదల

Ad not loaded.

ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న జితేందర్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు.

1980 లో జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో రియల్ ఇంసిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే సీరియస్ యాక్షన్ డ్రామా కథగా ఈ చిత్రం ఉండబోతుంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సారి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా తో నూతన చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమా హీరో ఎవరనేది త్వరలో ప్రకటించబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు, ఫస్ట్ లుక్ త్వరలోనే మీడియాకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags