దర్శకులు నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మించడం కొత్తేం కాదు. ఇటీవల కాలంలో స్టార్ దర్శకులు ఇలా ప్రొడ్యూసర్లు అవుతున్నారు. అన్ని భాషా పరిశ్రమల్లోనూ ఇలాంటి దర్శకులు మనకు కనిపిస్తున్నారు. అయితే ఇద్దరు ముగ్గురు దర్శకులు కలిసి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం మాత్రం అరుదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు అలాంటి ఆలోచన ఎవరూ చేయలేదేమో. తాజాగా తమిళ అగ్రదర్శకులు, కుర్ర దర్శకులు కలసి ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ బ్యానర్‌పై ఆసక్తి రేగుతోంది.
దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం ‘నవరస’ వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్‌సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో మణిరత్నం మరో అగ్ర దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్, మణిరత్నం కలసి రెయిన్ ఆన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో వారితోపాటు మరికొంతమంది తమిళ దర్శకులు కూడా భాగమవుతున్నారు. వారంతా కలసి ప్రతిభ ఉన్న దర్శకులకు ఆ బ్యానర్‌లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
మణిరత్నం, శంకర్‌తో కలిసి నిర్మాణంలో భాగం పంచుకుంటున్నవారిలో దర్శకులు వెట్రిమారన్, గౌతమ్ మేనన్, లింగుస్వామి, మిస్కిన్, శశి, వసంత బాలన్, లోకేష్ కనగరాజ్, బాలాజీ శక్తివేల్, మురుగదాస్ లాంటివాళ్లు ఉన్నారు. వీరంతా కలసి సినిమాల వర్షం కురిపించబోతున్నారట. అంతేకాదు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా ఈ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థలో తొలి చిత్రాన్నిలోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!