ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!

సినీ పరిశ్రమలో టాప్ ప్లేస్ ను దక్కించుకోవాలి అంటే సక్సెస్ అనేది చాలా ముఖ్యం. అది ఎప్పుడూ ఒక్కరి దగ్గరే ఉండదు. ఒక్కరి దగ్గరే ఆగిపోదు. అందుకే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళు అంటుంటారు. ‘ప్రతి శుక్రవారం లెక్కలు మారిపోతాయి’ అని..! అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ.. ‘ఆచార్య’ తో ప్లాప్ అందుకున్న తర్వాత ఈ విషయం అందరికీ అర్థమైంది.శంకర్, బోయపాటి శ్రీను వంటి దర్శకులు కూడా ప్లాపుల నుండి తప్పించుకోలేకపోయారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం తమ హిట్ ట్రాక్ ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా.. వీళ్ళ బ్రాండ్ వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదవుతున్నాయి.. మేకింగ్ తో అయినా నిర్మాతల్ని గట్టెక్కించేస్తున్నారు. ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎస్.ఎస్.రాజమౌళి :

అపజయమెరుగని దర్శకుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రాజమౌళి నే..!ఈయన తెరకెక్కించిన 12 సినిమాలు హిట్లే.. ! అందుకే రాజమౌళి పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ..! ఇతనికి ప్లాప్ అనేది ఎదురుపడదు అని ఇండియా మొత్తం నమ్ముతుంది.

2) ప్రశాంత్ నీల్ :

కన్నడ స్టార్ దర్శకుడు, ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 3 సినిమాలు హిట్లే..! అంతేకాదు రాజమౌళి తర్వాత సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తాడు అనే నమ్మకాన్ని కూడా సంపాదించుకున్నాడు.

3) అట్లీ :

ఈ తమిళ స్టార్ డైరెక్టర్ కూడా వరుసగా 4 హిట్లు కొట్టి.. ఇప్పుడు ఏకంగా షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ అనే బాలీవుడ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

4) లోకేష్ కనగరాజన్ :

కోలీవుడ్ దర్శకుడు, ‘విక్రమ్’ దర్శకుడు అయిన అట్లీ కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. మాస్టర్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా సూపర్ కలెక్షన్స్ ను నమోదు చేసి కమర్షియల్ హిట్ అనిపించుకుంది.

5) వెట్రిమారన్ :

ఈ తమిళ దర్శకుడు తెరకెక్కించిన 7 సినిమాలు హిట్లే..! ఇతనితో టాలీవుడ్ హీరోలు కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

6) రాజ్ కుమార్ హిరానీ :

ఈయన సినిమాలు కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ కూడా ఉంటుంది. అందుకే ఈయన సినిమాలు రికార్డులు కొల్లగొడుతుంటాయి. ఇతని సినిమా ఇప్పటివరకు ఒక్కటి కూడా ప్లాప్ అవ్వలేదు. అన్నీ హిట్లే.

7) అనిల్ రావిపూడి :

టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయిన అనిల్ రావిపూడి.. తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘ఎఫ్3’ చిత్రం ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ అయినప్పటికీ అబౌవ్ యావరేజ్ రిజల్ట్ ను సాధించింది.

8) వెంకీ కుడుముల :

‘ఛలో’ ‘భీష్మ’ రెండు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. మూడో సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు.

9) నాగ్ అశ్విన్ :

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు నాగ్ అశ్విన్.రెండు సినిమాలు హిట్లే..! ప్రస్తుతం ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే కచ్చితంగా ఇతను స్టార్ డైరెక్టర్ అయిపోవడం ఖాయం.

10) రవికాంత్ పేరేపు :

‘క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తో రెండు హిట్లు అందుకుని ఫామ్లో ఉన్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇతను కూడా సూపర్ టాలెంటెడ్. మరి సక్సెస్ ట్రాక్ ను కాపాడుకుంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus