Disha Patani: అరకొర బట్టల్లో పరువాల ప్రదర్శన చేసిన దిశా పటాని.. అందాల జడివానలో తడిసి ముద్దవుతున్న నెటిజన్లు!

  • July 4, 2023 / 02:02 PM IST

దిశా పటాని నటిస్తున్న సౌత్ ప్రాజెక్ట్ కంగువ. ఈ తమిళ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. ఇది భారీ పీరియాడిక్ మూవీ అని సమాచారం. ఈ చిత్రంలో దిశా కీలక రోల్ చేస్తున్నారు. మరోవైపు దిశా పటాని కొత్త బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. ఆమె గతంలో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేశారు. ఆయనతో కలిసి చిత్రాలు చేసింది. సడన్ గా టైగర్ ష్రాఫ్ కి హ్యాండ్ ఇచ్చి మోడల్ అలెగ్జాండర్ తో ఎఫైర్ నడుపుతుంది

అదే సమయంలో బాలీవుడ్ లో బిజీ అయ్యింది. అక్కడ వరుస ఆఫర్స్ పట్టేసి ఓ స్థాయి హీరోయిన్ అయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ప్రభాస్ కి జంటగా ప్రాజెక్ట్ కే లో నటిస్తుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇటీవల దిశా బర్త్ డే కానుకగా ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆమె లుక్ పూర్తి భిన్నంగా ఉంది.

ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తుండగా  (Disha Patani)దిశా లుక్ ఆ కాన్సెప్ట్ కి వ్యతిరేకంగా ఉంది. ఈ మూవీలో హీరో కాలాల్లో ప్రయాణిస్తున్నాడని సమాచారం. ఆ క్రమంలో దిశాది పీరియాడిక్ లుక్ కావచ్చు. ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ చేస్తున్నారు. దిశా సెకండ్ హీరోయిన్ . అయినప్పటికీ రూ. 5 కోట్లు వరకు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

కమల్ ఎంట్రీతో మూవీపై భారీ హైప్ ఏర్పడింది. అమితాబ్ సైతం కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దిశా పటాని అందాల జడివానలో నెటిజెన్స్ తడిసి ముద్దవుతున్నారు. ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అరకొరగా బట్టల్లో పరువాల ప్రదర్శన చేసింది. లోఫర్ మూవీతో వెండితెరకు పరిచయమైంది దిశా పటాని. మోడల్ అయిన దిశాను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశాడు. వరుణ్ తేజ్ కి జంటగా దిశా నటించిన లోఫర్ నిరాశపరిచింది. ఆ చిత్రం తర్వాత మరలా ఆమె తెలుగులో కనిపించలేదు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus