సీనియర్ నటి దివ్య వాణి భర్తకు దూరంగా ఉంటున్నారనే వార్తలు మీడయాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.. దీంతో ఆమె క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి.. నటిగా రాణించి, రాజకీయాల్లోనూ అడుగు పెట్టారామె.. ఛైల్డ్ ఆర్టిస్టుగా ‘సర్దార్ కృష్ణమనాయుడు’ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. కథానాయికగా.. ‘పెళ్లిపుస్తకం’, ‘ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్లాం’ లాంటి సినిమాల్లో అచ్చ తెలుగు పాత్రల్లో అలరించారు..
పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. 2005లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. ‘రాధాగోపాళం’, ‘పంచాక్షరి’, ‘వీర’, ‘మహానటి’ లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేశారు.. ‘పుత్తడి బొమ్మ’ తో పాటు కొన్ని సీరియళ్లలోనూ నటించారు.. చిన్న వయసులోనే ఆమెకు బిజినెస్ మెన్ దేవానంద్‌తో వివాహం జరిగింది.. వీరికి కిరణ్ కాంత్, తరుణ్యా దేవి సంతానం.. ఇటీవల రాజకీయాలకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించి వార్తల్లో నిలిచిన దివ్య వాణి తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి,
భర్తతో విడిపోయినట్లు వస్తున్న వార్తల గురించి స్పందించారు..ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను నా భర్తతో విడిపోయానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం.. ఆయన బిజినెస్ పనుల్లో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు.. పని వల్ల ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కి తిరుగుతుంటారు.. అందుకే ఎక్కువగా మాతో కలిసి ఉండరు.. అలాగని మా మధ్య ఎలాంటి గోడవలు లేవు.. సినిమాల్లోకి వెళ్లొద్దని కానీ.. రాజకీయాలు వద్దని కానీ ఆయన నాకెప్పూడూ చెప్పలేదు.. ఆయనది సున్నితమైన స్వభావం..
నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు.. బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా పిల్లల బాధ్యతలు నేనే చూసుకుంటాను.. ఇక రాజకీయాల విషయానికొస్తే.. సినిమా వాళ్లు అనగానే.. అందంగా ఉంటారు.. అడ్వాంటేజ్ తీసుకుందామనుకుంటుంటారు.. కానీ నేనెవ్వరికీ చనువివ్వలేదు.. పాలిటిక్స్‌లో సినిమా ఇండస్ట్రీ వాళ్లను చులకనగా చూస్తారు.. అది కూడా కొందరు వ్యక్తుల వల్లే సినిమా వాళ్లను చులకన భావంతో చూస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు సీనియర్ నటి దివ్య వాణి..
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!