DJ Tillu Collections: 5వ రోజున కూడా రూ.1 కోటి పైనే రాబట్టింది.!

  • February 17, 2022 / 02:06 PM IST

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డిజె టిల్లు’. ‘ఫార్చూన్ ఫోర్ సినిమాస్’ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా… డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. విడుదల చేసిన టీజర్, ప్రోమోలు, పాటలకి మంచి స్పందన లభించింది.దాంతో ఫిబ్రవరి 12న విడుదల అయిన ఈ చిత్రం …మొదటి షోతోనే హిట్ టాక్ ను రాబట్టుకోవడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

Click Here To Watch

దాంతో మొదటి 3 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వగా.. . 5వ రోజున కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఒకసారి 5 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 4.84 cr
సీడెడ్ 1.19 cr
ఉత్తరాంధ్ర 0.87 cr
ఈస్ట్ 0.52 cr
వెస్ట్ 0.60 cr
గుంటూరు 0.48 cr
కృష్ణా 0.40 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 cr
ఓవర్సీస్ 1.68 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 11.58 cr

‘డిజె టిల్లు’ చిత్రానికి రూ.8.98 కోట్ల బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.11.58 కోట్ల షేర్ ను రాబట్టింది.ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.2.38 కోట్ల లాభాలను అందించి దూసుకుపోతుంది. నిన్న బుధవారం నాడు కూడా ఈ చిత్రం ఏకంగా రూ.1 కోటికి పైగా షేర్ ను నమోదు చేసింది. ‘ఖిలాడి’ వంటి పెద్ద చిత్రం పోటీగా ఉన్నప్పటికీ.. దానిని మించి కలెక్ట్ ఈ మూవీ కలెక్ట్ చేస్తుండడం విశేషం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus