Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడొక టాప్ హీరో. కానీ ‘డిజె టిల్లు’కి(Dj Tillu) ముందు అతని ఐడెంటిటీ ఏంటి అంటే.. ‘గుంటూరు టాకీస్’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ హీరో అని మాత్రమే చెప్పుకునే వారు. అయితే విమల్ కృష్ణ దర్శకత్వంలో తానే ఓ రైటర్ గా మారి ‘డిజె టిల్లు’ అనే సినిమా చేశాడు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘ఫార్చూన్ ఫోర్ సినిమాస్’ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థల పై సూర్యదేవర నాగ వంశీ, సౌజన్య నిర్మించారు.

Dj Tillu

రవితేజ హీరోగా రూపొందిన ‘ఖిలాడి’ వంటి పెద్ద సినిమా పక్కన ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యింది ‘డిజె టిల్లు’.పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రవితేజ సినిమానే డామినేట్ చేయడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి టోటల్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :

 

నైజాం 7.07 cr
సీడెడ్ 1.79 cr
ఉత్తరాంధ్ర 1.35 cr
ఈస్ట్ 0.78 cr
వెస్ట్ 0.79 cr
గుంటూరు 0.65 cr
కృష్ణా 0.76 cr
నెల్లూరు 0.45 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 13.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.03 cr
ఓవర్సీస్ 2.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.77 cr(షేర్)

‘డిజె టిల్లు’ సినిమా రూ.9.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.16.77 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్స్ కి రూ.7.57 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

 

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus