‘డీజే టిల్లు’తో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఆ ఇమేజ్ నుంచి బయటపడి తన వెర్సటాలిటీని నిరూపించుకునే పనిలో పడ్డాడు. లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. సిద్ధు త్వరలోనే ఓ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, ‘రాజ రాజ చోర’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హసిత్ గోలీ.
హసిత్ గోలీ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘రాజ రాజ చోర’ కమర్షియల్‌గా మంచి హిట్టయింది. రీసెంట్‌గా వచ్చిన ‘శ్వాగ్’ బాక్సాఫీస్ దగ్గర తడబడినా, హసిత్ టేకింగ్, కొత్తదనం చూపించే ప్రయత్నం ఆడియన్స్‌కి నచ్చింది. ఇప్పుడు హసిత్, సిద్ధు బాడీ లాంగ్వేజ్‌కి సెట్ అయ్యేలా ఓ డిఫరెంట్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించవచ్చు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావొచ్చు.ప్రస్తుతం సిద్ధు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘కోహినూర్’, ‘బ్యాడాస్’ లాంటి ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. అలాగే ‘టిల్లు క్యూబ్’ కూడా సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది. అయితే, టిల్లు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ వేరు.
కానీ సిద్ధు ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.హసిత్ గోలీకి నేటి తరం ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు, కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం అతనికి మైనస్. మరోవైపు సిద్ధు క్రియేటివ్ ప్రాసెస్‌లో యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవుతాడు. వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే అవుట్‌పుట్ ఫ్రెష్‌గా ఉండే ఛాన్స్ ఉంది. మరి దిల్ రాజు ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్, సిద్ధుని ‘టిల్లు ట్రాప్’ నుంచి బయటపడేసి మరో సాలిడ్ హిట్ ఇస్తుందేమో చూడాలి.