Director Venu: బలగం వేణులో ఈ టాలెంట్ కూడా ఉందా?

  • February 6, 2024 / 08:36 PM IST

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో తన కామెడీ ద్వారా అందరిని ఎంతగానో సందడి చేశారు. ఇక జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి వేణు సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన ఈయన దర్శకుడిగా మారారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈయన బలగం సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత వేణు నాచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. నాని కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ కూడా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా వేణుకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈయన సినిమాలలోకి రాకముందు స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ గా రెండుసార్లు ఎంపిక అయ్యారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఈయన (Director Venu) మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ గా కూడా విన్ అయ్యానని తెలిపాడు. చిన్నప్పట్నుంచి అందరూ తనని బాబూమోహన్ కి చుట్టంలా ఉన్నావని, కమెడియన్ లా కనిపిస్తున్నావని అంటుండటంతో సినిమాలపై ఆసక్తి పెరిగి సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. ఇలా కమెడియన్ గా మొదలైనటువంటి తన ప్రయాణం దర్శకుడిగా మారి అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus