Mahesh Babu: గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ఖరీదు ఏంతో తెలుసా?

  • June 3, 2023 / 08:52 PM IST

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఈ సినిమా నుంచి గ్లింప్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఇందులో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించారు. ఇక ఈ వీడియోలో మహేష్ బాబు వేసుకున్నటువంటి షర్ట్ ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది.

ఈ సినిమాలో మహేష్ బాబు ఎరుపు రంగుచొక్కా ధరించగా దానిపై నల్లటి గీతలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం టీషర్ట్స్ మార్కెట్లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఏకంగా ఒక షర్ట్ కొంటే మరొక షర్ట్ అంటూ భారీ ఆఫర్స్ తో మార్కెట్లోకి వచ్చాయి. సాధారణంగా ఒక హీరో ఏదైనా షర్ట్ వేసుకున్న లేదా వాచ్ కట్టుకున్న అలాంటివి వేసుకోవాలని అభిమానులు కూడా భావిస్తారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్స్ ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

మహేష్ బాబు బ్రాండెడ్ షర్ట్ ధరించినప్పటికీ అంత ఖరీదైనవి అభిమానులు కొనలేని పక్షంలో పలు డమ్మీ బ్రాండ్ కు చెందినటువంటి షర్ట్స్ ఇలా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే మహేష్ బాబు వేసుకున్న ఈ షర్ట్ ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్సైట్లో 3 వేలకు అందుబాటులో ఉంది. అయితే మహేష్ బాబు ఈ షర్ట్ కావాలని వేసుకున్నారని మరికొందరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబుకు (Mahesh Babu) ఈ కామర్స్ బ్రాండెడ్ వెబ్సైట్ ఉన్న విషయం తెలిసిందే. దాంతో మహేష్ బాబు టై అప్ కావడంతోనే ఇలాంటి షర్ట్ వేసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్ విడుదలైన క్షణం నుంచి మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు డమ్మీ బ్రాండ్ కు చెందినటువంటి కంపెనీలు ఇలాంటి షర్ట్స్ తయారు చేసి మార్కెట్లోకి పెద్ద ఎత్తున తీసుకోవచ్చారు. అత్యంత తక్కువ ధరకే ఒకటి ఉంటే మరొకటి ఫ్రీ అంటూ భారీ ఆఫర్ కూడా ప్రకటించడం గమనార్హం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus