Allu Sneha Reddy: వామ్మో స్నేహ రెడ్డి చీర ఖరీదు అన్ని లక్షలా.. వైరల్ అవుతున్న ఫోటో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా ఇండస్ట్రీలో ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విధంగా స్నేహ రెడ్డి అల్లు అర్జున్ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు

అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి మాత్రం తన పిల్లల ఆలనా పాలన వారి బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇకపోతే అల్లుస్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. నిజం చెప్పాలంటే హీరోయిన్ రేంజ్ పాపులారిటీని ఈమె సొంతం చేసుకుందని చెప్పాలి. హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోకుండా వెరైటీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకొని పెద్ద ఎత్తున ఫోటోషూట్ లో నిర్వహిస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఇలా వరుస ఫోటో షూట్లతో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్న స్నేహ రెడ్డి తాజాగా ఒక సిల్వర్ కలర్ చీరలో ఫోటోషూట్ చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ చీరలో స్నేహ రెడ్డి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు ఆమె కట్టిన చీర గురించి పెద్ద ఎత్తున ఆరాతీస్తున్నారు. ఇకపోతే స్నేహ రెడ్డి ధరించిన ఈ సిల్వర్ రంగు చీర ప్రముఖ డిజైనర్ రిమ్జిమ్ దాదు రూపొందించిన ఈ చీరను మెటాలిక్ కార్డ్స్‌ తో తయారు చేశారు.

సిల్వర్ కార్డ్ స్ట్రాప్‌లెస్ ట్యూబ్ బ్లౌజ్ ఉన్న వెండి చీర చాలా ఖరీదైనదని తెలుస్తోంది. ఇలా ఈమె ధరించిన ఈ చీర ఖరీదు రూ.1,76,000 అని తెలుస్తోంది ఇలా ఒక్క చీర కోసం లక్షల ఖర్చు చేశారని తెలియడంతో ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1

2

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus