ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ ఎప్పుడు ఎంతో చలాకీగా సరదాగా అందరితో గడుపుతూ ఉంటారు. అల్లు అర్జున్ ని చూస్తే అసలు ఈయనకు కోపం అనేది రాదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతాయి. ఇక అందరిలాగే కొన్ని సందర్భాలలో అల్లు అర్జున్ కి కూడా పట్టరాని కోపం వస్తుందట.
ఇలా కోపం వచ్చిన తర్వాత ఈయన తన (Allu Arjun) భార్య పిల్లలపై అలాగే ఇంట్లో వర్కర్స్ పైన ఎప్పుడు కోపం చూపించరట.ఇక లొకేషన్ లో కూడా ఏ విషయంపై అయినా కోప్పడితే ఈయన ఎవరిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయరని తెలుస్తోంది. ఇక ఈయనకు కోపం వచ్చిన ఆ క్షణం సైలెంట్ గా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా తన కోపం పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి బయటకు వచ్చి అందరితో యధావిధిగా కలిసిపోతారట.
ఇలా కోపం వస్తే చాలామంది వస్తువులను పగలగొట్టడం, ఇతరులపై మండిపడటం వంటివి చేస్తుంటారు కానీ అల్లు అర్జున్ అలా ఎప్పుడు బిహేవ్ చేయరని లోపలికి వెళ్లి కోపం తగ్గేవరకు హాయిగా నిద్రపోతారని తెలిసి అభిమానులు ఈయన ఈ అలవాటుకు ఫిదా అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమా మహాభారతం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేశారు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!