బ్రేకప్… ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద మార్పే తీసుకొస్తుంది అంటారు. వ్యవహార శైలిలో, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలోనూ, వాటికి రియాక్ట్ అవ్వడంలోనూ … ఇలా చాలా విషయాల్లో మార్పులు వస్తాయి. తాజాగా ఇలాంటి మార్పులు నాగచైతన్య విషయంలో గమనించొచ్చు. సమంతతో వివాహబంధానికి స్వస్తి పలికాక నాగచైతన్య కొద్ది రోజులు కామ్‌గా ఉన్నారు. సోషల్ మీడియాలో ముందు నుండే పెద్దగా యాక్టివ్‌గా ఉండని ఆయన… బ్రేకప్ వెంటనే పూర్తిగా సోషల్ మీడియాలో కనిపించలేదు.
అయితే ఇప్పుడు చూస్తే పరిస్థితి మారింది. ముందుగా చెప్పినట్లు సోషల్ మీడియాను నాగచైతన్య తక్కువగానే వాడేవారు. అప్పుడప్పుడు పోస్ట్‌లు పెట్టేవారు. ఇప్పుడు చూస్తే చైతు… సినిమా ప్రచారానికి బాగా వాడుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ‘బంగార్రాజు’ గురించి తండ్రీకొడుకులు సోషల్ మీడియాలోనే సరదా ముచ్చట్లు ఆడుకున్నారు. నిజానికి ‘లవ్ స్టోరీ’ సినిమా నుండే చైతులో ఈ మార్పు మొదలైంది. ‘బంగార్రాజు’దగ్గరకు వచ్చేసరికి ఆ హడావుడి ఎక్కువైంది. ‘బంగార్రాజు’ సినిమా ప్రచారం షురూ హీరోయిన్ కృతి శెట్టి ఫొటోను తొలుత రిలీజ్ చేశారు.
దానికి టీజర్‌గా ‘నాగలక్ష్మిని రేపు చూపిస్తాం’ అని ఓ పోస్టర్ పెట్టారు. దానికి నాగార్జున ‘అంతా ఓకే రా మరి బంగార్రాజు ఎప్పుడు?’ అని అడిగారు. దానికి చైతు ‘లేడీస్ ఫస్ట్’ అంటూ ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ స్టఫ్ ఇచ్చారు. దీనిని చూసి అభిమానులు చైతు తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు అనుకుంటున్నారు. ఒరిజినల్ చైతు ఇలానే ఉంటాడు అంటుంటారు అతని సన్నిహితులు. అంటే ఇప్పుడు ఒరిజినల్ చైతు చూస్తున్నాం అన్నమాట.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!