Skanda: నార్త్ ప్రమోషన్ కోసం ఆ ప్లాప్ సినిమాని కూడా వాడుకుంటున్న బోయపాటి!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కంద’. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కాకపోతే ట్రైలర్ లో కొన్ని విజువల్స్ ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో మాదిరి ఉన్నాయనే విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.

ఏది ఏమైనా దర్శకుడు బోయపాటి సినిమాలు అంటే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది అనేది వాస్తవం. ఆయన ప్లాప్ సినిమాలు కూడా బి,సి సెంటర్స్ లో భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తాయి. టి.ఆర్.పి రేటింగ్ లకి కూడా ఢోకా ఉండదు. ‘స్కంద’ కి నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.54 కోట్లు పలికాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది పక్కన పెడితే.. ‘స్కంద’ రిలీజ్ డేట్లు ఇప్పటికే మూడు సార్లు మారాయి. మొదట ఈ సినిమాని అక్టోబర్ 20 న దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.

కానీ కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 15 కి మార్చారు. ఇప్పుడు ఆ డేట్ కూడా కాదు అని.. సెప్టెంబర్ 28 కి వెళ్లారు. పాన్ ఇండియా సినిమాలకి అది మంచి డేట్ అనేది మేకర్స్ అభిప్రాయం. ఓ పోస్టర్ తో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టర్లో బోయపాటి హిట్ సినిమాలు ‘సరైనోడు’ ‘అఖండ’ సినిమా పేర్లు వేశారు. అందులో పెద్ద వింత లేదు. కానీ ‘జయ జానకి నాయక’ అనే హిందీ వెర్షన్ ‘కూన్ కార్’ పేరుని కూడా వేయడం గమనార్హం.

వాస్తవానికి ఆ సినిమా తెలుగులో హిట్ అవ్వలేదు. కానీ హిందీ యూట్యూబ్ ఛానల్స్ లో ఆ సినిమా 500 మిలియన్లకి పైగా వ్యూస్ తో ప్రపంచ రికార్డులు బద్దలుగొట్టింది. (Skanda) ‘స్కంద’ హిందీ వెర్షన్ ప్రమోషన్ కోసం ‘జయ జానకి నాయక’ హిందీ వెర్షన్ ను బోయపాటి వాడుకుంటున్నట్టు స్పష్టమవుతుంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus