Bigg Boss Telugu 7: 14 మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి లాక్ వేశాడు కింగ్ నాగార్జున. అయితే, ఈసారి సీజన్ అంతా ఉల్టాపల్టా అని మొదటి నుంచీ చెప్పినట్లుగానే షోని మంచి రసవత్తరంగా డిజైన్ చేశారు. హౌస్ లోకి వచ్చిన ఫస్ట్ 5మంది పార్టిసిపెంట్స్ తో బ్రీఫ్ కేస్ గేమ్ ఆడించి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో క్యాష్ ని 5లక్షల నుంచీ 35 లక్షల వరకూ పెంచినా కూడా పార్టిసిపెంట్స్ ఎవరూ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో బ్రీఫ్ కేస్ వేస్ట్ అయ్యింది. అసలు ఈ ట్విస్ట్ ఎందుకు ఇచ్చాడో తెలియాలంటే పార్టిసిపెంట్స్ ఎవరెవరు వచ్చారు అనేది ఒక్కసారి చూసినట్లయితే.,

నెంబర్ – 1 – ప్రియాంక జైన్

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ప్రియాంక జైన్ ఫస్ట్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అంతేకాదు, సిల్వర్ బ్రీఫ్ కేసు తీసుకుని మరీ హౌస్ లోకి వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన హౌస్ మేట్స్ ఆ బ్రీఫ్ కేసుని చూడకూడదని టాస్క్ ఇస్తే ఎక్కడ దాచాలో తెలియక జైల్ లో ఉన్న వాష్ రూమ్ లో దాచి పెట్టింది. గేమ్ లో తెలివిగా వ్యవహరించింది. ఆ తర్వాత నాగార్జున వచ్చి టెమ్టింగ్ ఆఫర్ గా బ్రీఫ్ కేసులో 35లక్షలు ఇస్తానన్నా కూడా తీస్కోలేదు.

నెంబర్ 2 – హీరో శివాజీ

చాలాకాలం నుంచీ వెండితెరకి దూరం అయిన హీరో శివాజీ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ద్వారా ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అంతేకాదు, పొలిటికల్ గా కూడా తనకి ఈ ఫ్లాట్ ఫార్మ్ మంచి వర్కౌట్ అయ్యేలాగే కనిపిస్తోంది. ఇక బ్రీఫ్ కేసులో మనీ ఉన్నా కూడా తీస్కోనని ఖరాఖండిగా చెప్పేశాడు.

నెంబర్ 3 – సింగర్ థామిని

పచ్చబొట్టేసిన సాంగ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సింగర్ థామిని మూడో పార్టిసిపెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. చాలా హుందాగా వచ్చింది. రీసంట్ గా తనకి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన కొండపొలం సాంగ్ పాడి అందర్నీ ఆకట్టుకుంది. నాగార్జున భార్య అమలకి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చింది. అంతేకాదు సిల్వర్ బ్రీఫ్ కేస్ ని రిజక్ట్ చేసి విన్నర్ అవ్వడానికే వచ్చానని చెప్పింది. మరి గేమ్ ఎలా ఆడుతుందనేది చూడాలి.

నెంబర్ 4 – ప్రిన్స్ యవార్

మోడల్ గా సీరియల్ ఆర్టిస్ట్ గా ప్రిన్స్ యవార్ చాలామందికి తెలుసు. కొల్ కత్తాకి చెందిన ఈ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యేందుకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. చాలా యవార్ – ఓవర్ అనేలాగా రెచ్చిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు ఎన్ని వారాలు గేమ్ ఆడతాడు అనేది చూడాలి.

నెంబర్ 5 – శుభశ్రీ

రుద్రవీణ అనే సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన హీరోయిన్ శుభశ్రీ. మస్తీ జాదీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసింది. అంతేకాదు, లాయర్ – డ్యాన్సర్ – సింగర్ – డైరెక్టర్ – రైటర్ ఇలా అన్నింటిలోనూ ఈ అమ్మడికి ప్రవేశం ఉంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి రాగానే తన ఎగ్జైంట్మెంట్ ని చూపించింది. సిల్వర్ బ్రీఫ్ కేస్ ని రిజక్ట్ చేసింది.

ఇలా ఫస్ట్ 5 గురు కంటెస్టెంట్స్ బ్రీఫ్ కేస్ లో ఉన్న 35లక్షల క్యాష్ ని రిజక్ట్ చేశారు. ఒకవేళ తీసుకుని ఉంటే ఇంట్లో ఉండే అర్హత మీకు లేదని, బ్రీఫ్ కేస్ లో క్యాష్ లేదని చెప్తే మొత్తానికి మోసం వచ్చేది. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనేమో అయ్యేది. లక్కీగా వీళ్లు ఎస్కేప్ అయ్యారు.

నెంబర్ 6 – షకీలా

చాలా హోమ్లీగా స్టేజ్ పైకి వచ్చింది షకీలా. తను బీ గ్రేడ్ సినిమాలు మాత్రమే చేశాను కానీ, నా క్యారెక్టర్ బీ గ్రేడ్ కాదని నిరూపించుకునే ప్రయత్నమే ఈ షోకి రావడం అని చెప్పింది. అంతేకాదు, షకీ అమ్మగా మారాను అని, చాలామంది ట్రాన్స్ జెండర్స్ ని అడాప్ట్ చేసుకున్నానని చెప్పడం, తన సపోర్టర్స్ అయిన ట్రాన్స్ జెండర్స్ స్టేజ్ పైకి రావడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది.

నెంబర్ 7 – కొరియోగ్రాఫర్ సందీప్

నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ తో వైఫ్ తో కలిసి టైటిల్ కొట్టిన సందీప్ , మరోసారి బిగ్ బాస్ ట్రోఫీని కొట్టేందుకు రెడీగా వచ్చినట్లుగానే కనిపిస్తున్నాడు. పక్కా ప్లానింగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టాడు సందీప్. మరి గేమ్ ఎలా ఆడతాడు అనేది చూడాలి.

నెంబర్ 8 – శోభాశెట్టి

కార్తీక దీపం మోనితాగా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో చెరగని ముద్ర వేసిన శోభాశెట్టి 8వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. కొంచెం గడసరి పిల్లగానే కనిపిస్తోంది. మరి గేమ్ ఎలా ఆడుతుందనేది చూడాలి.

నెంబర్ 9 – టేస్టీ తేజ

యూట్యూబ్ లో ఫేమస్ టేస్టీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన తేజ జబర్దస్త్ లో అదిరే అభి టీమ్ లో చాలా స్కిట్స్ చేశాడు. అంతేకాదు, మనోడి ఎవి చాలా ఫన్నీగా – ట్రెండీగా అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 7లో మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నాడు.

నెంబర్ 10 – రతికా నాయక్

సింపుల్ గా వచ్చినా అమ్మడు ఎక్కడా తగ్గేలా మాత్రం కనిపించడం లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసినా గుర్తుంపు రాలేదని ఇప్పుడైనా కనీసం గుర్తిస్తారని వచ్చానని చెప్పింది. మరి గేమ్ ఆడుతుందో, గుర్తుంచకుండానే వెళ్లిపోతుందో చూడాలి.

నెంబర్ 11 – గౌతమ్ కృష్ణ

హీరో గౌతమ్ కృష్ణ ఆకాశ వీధుల్లో అనే సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. రాగానే నాగార్జున టాస్క్ ఇవ్వడంతో హౌస్ లోకి కఫ్స్ తీస్కుని వెళ్లాడు. మరి అది ఎవరికి వేస్తాడు అనేది చూడాలి.

నెంబర్ 12 – కిరణ్ రాధోడ్

గ్లామరస్ క్వీన్ గా అప్పట్లో తెలుగు తెరని ఏలిన కిరణ్ రాథోడ్ తర్వాత సినిమాలకి దూరం అయ్యింది. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరవ్వాలని వచ్చింది. తెలుగు అస్సలు రాని కిరణ్ హౌస్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.

నెంబర్ 13 – పల్లవీ ప్రశాంత్

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అంటూ వీడియోస్ చేయడం ద్వారా ఫేమస్ అయిన రైతుబిడ్డ ఎట్టకేలకి హౌస్ లోకి అడుగుపెట్టాడు. అంతేకాదు, బస్తా బియ్యం – మట్టి నాగార్జునకి గిఫ్ట్ గా కూడా తీస్కుని వచ్చాడు. హౌస్ లోకి మెరపకాయ్ మొక్కతో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా ఆడతాడు అనేది చూద్దాం.

నెంబర్ 14 – అమర్ దీప్

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు వారికి దగ్గరయిన అమర్ దీప్ నీతోనే డ్యాన్స్ లో అదరగొట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లో స్టేజ్ పైన దుమ్మురేపే పెర్ఫామన్స్ తో హౌస్ లోకి అడుగుపెట్టాడు. మరి అన్ని వారాలు గేమ్ లో ఉంటాడా లేదా అనేది చూడాలి.

వీళ్లతో పాటుగా మరికొంతమంది పార్టిసిపెంట్స్ కూడా రాబోతున్నారు. వాళ్లు నెక్ట్స్ వీక్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ ఎపిసోడ్స్ షూటింగ్ అయ్యిందా లేదా, వాళ్లని హౌస్ లో ఉంచారా లేదా వేరే ఇంకెక్కడైనా ఉంచారా అనేది చూడాలి. మొత్తానికి (Bigg Boss Telugu 7) సీజన్ 7ని సరికొత్తగా ఆరంభించారనే చెప్పాలి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus