బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణం సినీ జనాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. నలభై ఏళ్లకే యువ నటుడు గుండెపోటుతో మరణించడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. గుండెపోటు రావడంతో గురువారం ఉదయం 10:30 నిమిషాలకు సిద్ధార్థ్ తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ వ్యక్తిగా ఉండే సిద్ధార్థ్ కి గుండెపోటు రావడం ఏంటనే విషయం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఫిట్ నెస్ కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సిద్ధార్థ్.. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్లు చేసినట్లు సమాచారం.
రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్న సిద్ధార్థ్.. పది గంటల సమయంలో జాగింగ్ తో పాటు కొన్ని వర్కవుట్స్ చేశాడని తెలుస్తుంది. అనంతరం నిద్రపోయే ముందు కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాడని.. అయితే తెల్లవారుజానుమ 3 గంటలకు ఛాతిలో నొప్పి రావడంతో తన తల్లికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె స్వయంగా నీళ్లు తాగించారు. ఆ తరువాత నిద్రపోయిన సిద్ధార్థ్ మళ్లీ మేల్కోలేదని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. ఫిట్ నెస్ కి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధంర్త్ ప్రతిరోజు క్రమం తప్పకుండా మూడు గంటల పాటు వ్యాయామం చేసేవాడట.
అయితే వర్కవుట్ సమయాన్ని కాస్త తగ్గించాలని ఇటీవల డాక్టర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం. వర్కవుట్స్ ఎక్కువగా చేయడం కూడా ప్రమాదమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్థిక జీవనశైలితో పాటు ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు తలెత్తడం వంటివి జరుగుతున్నాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఫిట్ నెస్ తో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!