Pushpa Movie: ఆ ఐటెమ్‌ సాంగ్‌తో అంత వేడి ఉందా?

  • July 25, 2021 / 10:16 PM IST

అల్లు అర్జున్‌ – సుకుమార్‌ – దేవిశ్రీప్రసాద్‌… ఈ కాంబినేషన్‌ సందడి మామూలుగా ఉండదు. ఇప్పటికే ఈ ముగ్గురూ కలసి మూడు సార్లు వచ్చారు. మూడుసార్లు అదరగొట్టారు. సినిమా ఫలితం సంగతి పక్కనపెడితే ఈ కాంబోలో వచ్చే పాటలు మామూలుగా ఉండవు. వాటిలో ఐటెమ్‌ సాంగ్స్‌కి ఎప్పుడూ స్పెషల్‌ ప్లేస్‌. ఇప్పుడు ‘పుష్ప’తో మరోసారి ఈ ముగ్గురూ కలసి వస్తున్నారు. దీంతో ఈ సినిమాలో పాటల గురించి చాలా పెద్ద అంచనాలే ఉన్నాయి.

అందులోనూ ‘పుష్ప’లో పాటలు మామూలుగా ఉండవు అంటూ ఆ మధ్య దేవిశ్రీప్రసాద్‌ ఓసారి చెప్పారు కూడా. దీంతో ఫ్యాన్స్‌ మరింత అంచనాలు పెట్టేసుకున్నారు. ఈ సినిమా ఐటెమ్‌ సాంగ్‌ గురించి ఎదురుచూడని యువత ఉండదు. దీంతో ఇందులో బన్నీ సరసన ఎవరు ఆడిపాడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ మాటకు ఊర్వశి రౌటేలా అనే సమాధానం వచ్చేసరికి… ఆ నల్ల గులాబీ కోసం అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో అభిమానులు, మాస్‌ పాటలు అంటే ఇష్టపడేవారికి ఇంకొక గుడ్‌ న్యూస్‌.

ఆ పాటలో బన్నీతో డ్యాన్స్‌ వేసేది ఒక్క భామ కాదట… ఇద్దరు ముద్దుగుమ్మలు ఆడిపాడతారట. అంతేకాదు ఆ రెండో ముద్దు గుమ్మ సన్నీ లియోన్‌ అనేది తాజా సమాచారం. దీంతో ‘పుష్ప’ ఐటెమ్‌ సాంగ్‌ వేడి మామూలుగా ఉండదు అంటున్నారు జనాలు. చూద్దాం… సన్నజాజి తీగలాంటి ఊర్వశి, ఇంగ్లిష్‌ కోడిలాంటి సన్నీ లియోని… మన బన్నీ పక్కన ఎలా ఉంటారో.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus