సంక్రాంతి (Sankranti) సీజన్ అంటే సినిమాల సీజన్ అని అనుకోవాలి. ఈ టైంలో థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్తారు. అందువల్ల ఈ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలు కమర్షియల్ గా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. 2025 సంక్రాంతి హడావిడి ముగిసింది. ఇక 2026 సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి అనే చర్చ కూడా నడుస్తోంది. ఇలాంటి టైంలో ఓ డబ్బింగ్ సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalpathy) చివరి సినిమాగా ‘జన నాయగన్’ రూపొందుతుంది.ఇప్పటివరకు ఇది ‘దళపతి 69′(వర్కింగ్ టైటిల్) తో ప్రచారమవుతూ వచ్చింది. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు డిస్కషన్ నడుస్తుంది.
కానీ మేకర్స్ ఆ ఆలోచనని మార్చుకున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తారని చెబుతున్నారు.అయితే ఓవర్సీస్ బిజినెస్ మాత్రం అక్టోబర్ రిలీజ్ అని చెప్పి చేశారట నిర్మాతలు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. సంక్రాంతి టైంలో విజయ్ నుండి వచ్చిన ‘మాస్టర్’ (Master) ‘వారసుడు’ (Varasudu) సినిమాలు ఇక్కడ బాగానే ఆడాయి.