సాయి పల్లవి (Sai Pallavi) క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్.. సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ ఇచ్చాడు అంటే చిన్న విషయం కాదు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా అలాంటిది. రెగ్యులర్ హీరోయిన్లు మాదిరి కాదు. సాయి పల్లవి చాలా స్పెషల్. ప్రతి పాత్రని ఆమె ఎంత డెడికేటెడ్ గా చేస్తుందో.. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. అలాగే ఆమె కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది.
‘కోట్లు పారితోషికం ఇస్తాము’ అని చెప్పినా ఆమె అన్ని సినిమాల్లోనూ నటించదు. సినిమాలు ఎక్కువగా రిజెక్ట్ చేస్తే ఆఫర్లు రావేమో అనే భయం కూడా ఆమెకు ఉండదు. సినిమాలు రాకపోతే డాక్టర్ గా నా పని నేను చూసుకుంటాను అనే మొండి ధైర్యం సాయి పల్లవిది. అది కూడా ఆమెకు ప్లస్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. తాజాగా సాయి పల్లవికి హీరో కార్తీ కూడా ఫిదా అయిపోయినట్టు చెప్పుకొచ్చాడు.
కార్తీ (Karthi) మాట్లాడుతూ..” ‘ప్రేమమ్’ సినిమాలోని మలార్ నుండి ‘అమరన్’ లోని (Amaran) ఇందు వరకు .. నువ్వు చేసిన ప్రతి పాత్ర సో స్పెషల్ సాయి పల్లవి. అన్ని పాత్రలకి నువ్వు జీవం పోశావ్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి అంత వేరియేషన్ ఎలా చూపించగలుగుతున్నావో అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
ముఖ్యంగా ‘అమరన్’ లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు ఎంత అల్లాడిపోయిందో, ఆమె ఆవేదన,బాధ ఎవ్వరికీ తెలీదు. నీ సహజమైన నటన వల్ల అది అందరికీ అర్థమైంది. స్క్రీన్ పై అలాంటి పెర్ఫార్మన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు..హ్యాట్సాఫ్” అంటూ సాయి పల్లవిని పొగడ్తలతో ముంచేశాడు.