’90s ‘ (90’s – A Middle-Class Biopic) వెబ్ సిరీస్ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా ‘ఈటీవి విన్’ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. ఆ సంస్థకి 3 రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ‘ఫేడౌట్ అయిపోయిన బ్యాచ్ తో చేసిన ఆ సిరీస్ ఏం సక్సెస్ అవుతుంది?’ అని కామెంట్లు చేసిన వాళ్ళు లేకపోలేదు. కానీ ’90s ‘ వెబ్ సిరీస్ వారి అంచనాలను తలకిందులు చేసి సూపర్ సక్సెస్ అయ్యింది.
ఈటీవీ విన్ కి ఇప్పుడు సబ్ స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఇక ఈ మధ్యనే సైలెంట్ గా ‘ఏం చేస్తున్నావ్ ’ అనే సినిమా కూడా ఈటీవీ విన్ లో డిజిటల్ రిలీజ్ అయ్యింది. ‘ఎన్ వి ఆర్ ప్రొడక్షన్స్’, ‘సిద్స్ క్రియేటివ్’ సంస్థల పై నవీన్ కురువ, కిరణ్ కురువ నిర్మించిన ఈ సినిమాని భరత్ మిత్ర డైరెక్ట్ చేశాడు. గత ఏడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాని జనాలు పట్టించుకోలేదు.
కాస్త ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది అని మేకర్స్ చెబుతున్నారు. డైలాగ్స్, హీరో రాజ్ నేచురల్ పెర్ఫార్మన్స్ .. యూత్ ని ఆకట్టుకుంటున్నట్టు వారు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రభాస్ ని కాప్ రోల్లో చూడాలని ఉంది’ అంటూ హీరో పలికే డైలాగ్ పై చాలా మీమ్స్ వచ్చాయి అని కూడా ఈ సందర్భంగా మేకర్స్ చెప్పడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక ఈ సందర్భంగా.. ఈటీవి విన్ మార్కెటింగ్ హెడ్ నితిన్(Nithiin),ఈటీవి విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ..’ ‘ఏం చేస్తున్నావ్’ మూవీ ’90s ‘ వెబ్ సిరీస్’ లానే మంచి రిజల్ట్ ను అందుకుంది’ అని..నిన్న ప్రసాద్ ల్యాబ్స్ ఓ సక్సెస్ మీట్ ను నిర్వహించి మరీ తెలియజేశారు.