తాప్సీ డేట్స్ కారణంగా డిలే అవుతున్న మిథాలీ బయోపిక్

  • July 31, 2018 / 11:41 AM IST

స్టార్ ఇండియన్ ఫీమేల్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా “మిథాలీ” పేరుతో ఓ బయోపిక్ ను తెరకెక్కించాలని రెండేళ్ల క్రితమే నిశ్చయించుకొన్నారు. ఈమేరకు కొన్ని నిర్మాణ సంస్థలు ముందుకు రావడం, మిథాలీ కూడా ధోనీ తరహాలో సినిమాకి సపోర్ట్ తోపాటు తన జీవితంలో ఎవరికీ తెలియని విషయాలను బయోపిక్ కోసం వెల్లడించడంతోపాటు సినిమా మార్కెటింగ్ మరియు పబ్లిసిటీ విషయంలో కూడా సహాపడతానని చెప్పింది.

అయితే.. మిథాలీ పాత్రలో నటించాల్సిన తాప్సీ ప్రస్తుతం బిజీగా ఉండడంతోపాటు.. స్క్రిప్ట్ వర్క్ కూడా అనుకొన్నంత ఆసక్తికరంగా రాకపోవడంతో సినిమాని ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశారట. దాంతో తన బయోపిక్ ను త్వరగా తెరపై చూసుకోవాలని కంగారుపడిన మిథాలీ కలలకి బ్రేక్ పడింది. సో, తాప్సీ తన తాజా కమిట్ మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని డేట్స్ ఎలాట్ చేస్తే తప్ప మిథాలీ బయోపిక్ ఇప్పుడప్పుడే సెట్స్ కు వెళ్ళడం కష్టం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus